రేపు కేసీఆర్ సభ : ఈ రూట్స్ లో వెళ్ళే వాళ్ళు స్కిప్ చేయండి !

-

సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. సో మీరు హైదరాబాద్ లో ఉండేవారు అయితే ఆయా రూట్ లు ఏవో కాస్త చెక్ చేసుకోండి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాలకు రాకపోకలకు అనుమతి లేదు. సభ కోసం సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ వాహనాలు నిలపాలని కోరారు.

Traffic control with google maps In Hyderabad traffic police

ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఓల్డ్ సిటీ నుండి వచ్చే వాహనాలు పీపుల్ ప్లాజా వద్ద పార్క్ చేయాలని కోరారు. ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీలో నిలపాలని, మెదీపట్నం నుండి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ గ్రౌండ్ టు అండ్ త్రీ వద్ద పార్క్ చేయాలని కోరారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి మాస్క్ భౌతిక దూరం శానిటైజర్ తప్పనిసరి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version