హైదరాబాద్ బాలిక మిస్సింగ్ కేసులో ట్విస్ట్…బాయ్ ఫ్రెండ్ తో కలిసి…!

-

 

హైదరాబాద్ సుల్తాన్ బజార్ పిఎస్ లో మైనర్ బాలికపై మిస్సింగ్ కేసు పై సుల్తాన్ బజార్
సిఐ షాకింగ్ నిజాలు చెప్పారు. యువతి మిస్సింగ్ అయిందని మొద‌ట‌ పేరెంట్స్ ఫిర్యాదు చేశారని..
వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసామన్నారు. మైనర్ బాలిక ట్రేస్ అవుట్ అయిందని.. బాలిక విచారణలో ఇష్ట పూర్వకంగా తన బాయి ఫ్రెండ్ తో వెల్లినట్లు ఒప్పుకుంద‌ని చెప్పారు. యువతి డిప్రెషన్ లో ఇంట్లో నుండి వెళ్లి పోయినట్లు పేరెంట్స్ తెలిపారన్నారు.

కానీ రాచకొండ ఉప్పల్ & మేడిపల్లి పిఎస్ పరిధి లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కానీ బాలిక మాత్రం తాను ఇష్టపూర్వకంగా తన బాయ్ ఫ్రెండు తో కలిసి వెళ్లినట్లు పోలీసులకు వెల్లడించిందన్నారు. కేవలం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయిందని తెలిపారు. హైదరాబాద్ లో బాలికపై అత్యాచారం జరగలేద‌ని స్ప‌ష్టం చేశారు. రాచకొండ మేడిపల్లి పిఎస్ పరిధి లో అత్యాచారం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇంకా కేసు విచారణలో ఉందని…పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version