మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి గడప తొక్కిన హైడ్రా బాధితులు..

-

మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి హైడ్రా బాధితులు చేరుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆయన ఇంటికి వెళ్లి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

హైడ్రా కూల్చివేతలతో తమ సొంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవన్‌కి వచ్చి తమ గోడును వెళ్లబోసుకోవడంతో.. హరీష్ రావు వారి సమస్యను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు.బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు తమకు అండగా నిలిచారు. ఈ సాయం తాము ఎప్పటికీ మరిచిపోలేం అని కాలనీవాసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news