నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కే లాభం.. కాదంటే పార్టీకే నష్టం : రాజగోపాల్ రెడ్డి

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కల్పించాలని నేరుగా డిమాండ్ చేయకుండా పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టారు.శుక్రవారం ఆయన మీడియాతో ఈ సందర్భంగా మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘నాకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకే లాభం. 2018లో నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాలేదు. నిద్రాహారాలు మాని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించా. ఇప్పుడు మంత్రి పదవి కాంగ్రెస్ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం’ అని పరోక్షంగా పార్టీని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

https://twitter.com/TeluguScribe/status/1900374018982895951

Read more RELATED
Recommended to you

Latest news