బడ్జెట్ ప్రసంగం అనంతరం గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం, ఆ తర్వాత స్పీకర్‌తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వాదన నేపథ్యంలో మాజీ మంత్రిని సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తప్పుబడుతున్నారు.
అయితే, స్పీకర్ చైర్‌లో ఉన్న వ్యక్తికి సామాజిక గుర్తింపు అంటగట్టడం ఏమిటని మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరినట్లు సమాచారం. దళిత అధికారి, దళిత జడ్జి, గిరిజన పోలీసు, బీసీ మంత్రి, మహిళా ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఆ వ్యక్తుల మనోభావాలను గాయపరుస్తాయి.వాళ్లు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరుకొని ఉంటారు.ఆ పోజిషన్ లోకి రావడం వాళ్ల హక్కు’ అందుకే స్పీకర్‌కు సామాజిక గుర్తింపు అంటగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.