మాటిమాటికి అరిచేతులు చెమట పడుతున్నాయా?

-

శరీరానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైన చేతుల్ని బట్టి అంచనా వేస్తారు వైద్యులు. వీటి రంగు, చర్మం తీరును బట్టి శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను అంచనా వేయవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే అరచేతిని బట్టి వ్యాధిని కనుగొనవచ్చు. అసలు అరచేతులు ఎందుకు చెమటలు పడుతాయో తెలుసుకోండి.

వణికే చేతులు 

ఈ సమస్య వృద్దుల్లో చూస్తుంటాం. వయసు మీద పడితేనే అలా చేతులు వణుకుతాయి అనుకుంటే పొరపాటే. కెఫిన్ ఎక్కువగా తీసుకునే వారికి చేతులు వణుకుతుంటాయి. వీరు మాత్రమే కాదు ఆందోళనలో ఉండేవారికి, ఆస్తమా వ్యాధి కలిగిన వారికి అప్పుడప్పుడు చేతులు వణకడం గమనించవచ్చు. మానసిక రోగాలకు సంబంధించిన మందులు వాడేవారిలో ఈ రకమైన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నరాల బలహీనత ఉండేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. చేతులు వణుకుతున్నప్పుడు వారి అరచేతులకు చెమట పడుతుంటుంది.

Hyperhidrosis is a condition for excessive sweating

అరచేతుల్లో చెమటలు 

కొంతమందికి అరచేతుల్లో చెమటలు పడుతూనే ఉంటాయి. ఒకసారి తుడుచుకున్న కొద్దిసేపటికే మరలా చేతులు తడిగా ఉంటాయి. వీరు ఒత్తిడికి గురవుతున్నారాని అర్థం చేసుకోవచ్చు. లేదా జీవక్రియ రేటుని ప్రేరేపించే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ విడుదలయినప్పుడు అరచేతులు చెమటపడుతాయి. ఈ రెండు సమస్యలు దీనికి కారణం కాకుండా ప్రతిరోజూ ఇలానే అరచేతులు చెమట పడుతుంటే మాత్ర తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రది సలహా తీసుకోవాలి.

బ్లూ ఫింగర్‌టిప్స్

చేతివేళ్లపై నీలిరంగులో కనిపిస్తున్నా, మచ్చలు ఉన్నా రక్తప్రసరణ సరిగ్గా జరుగడం లేదని అర్థం. దీన్నే రేనూడ్ సిండ్రోమ్ అంటారు. ఇది అంత ప్రమాదకరమైనదేమీ కాదు. కానీ, దీనివల్ల చేతివేళ్లు, అరికాళ్లు ఎరుపు, నీలం, తెలుపు రంగులోకి మారుతాయి. అప్పుడు మంటతో పాటు దురద కూడా పుడుతుంది. అంతేకాదు దీనివల్ల అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుంది.

పీరియడ్స్ సమయంలో 

మహిళల్లో చాలామందికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో శరీరమంతా చెమటలు పట్టడంతో పాటు కళ్లు తిరుగుతాయి. చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అంతా కమ్మేసినట్టు ఉంటుంది. అరచేతులు చెమటపట్టడంతో మరింత ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొబ్బరినీళ్లుగాని, స్రైట్‌గాని తాగితే కొంతమేరకు కోలుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version