కే.కేశవరావును తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని’ అని ఆయన అన్నారు.ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని కేశవరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ఉందని ,6 నెలల్లో ఎవరిని కూడా అంచనా వేయలేమని అన్నారు. ఆరు నెలల్లో ప్రతిదీ కార్యక్రమం అభివృద్ధితో కూడిందే చేస్తున్నారని.. ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నైతిక విలువలతో రాజీనామా చేశానని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ కు కూడా అదే చెప్పానని కేశవరావు పేర్కొన్నారు.కాగా.. రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు ఈరోజు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని, నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని అన్నారు.