స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై ఆయన ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో, లెటర్ రిలీజ్ చేశారు. తనకు రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని పేర్కొన్న శ్రీనివాసరావు..
సెల్ఫీ వీడియో,లెటర్‌ను రాజమౌళి సన్నిహితులకు పంపించారు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తను చేసిన వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ కోసం కాదని, ఇదంతా శాంతినివాసం సీరియల్ టైంలో జరిగిన ఘటన అని.. ఒక అమ్మాయి విషయంలో తనకు రాజమౌళికి వివాదం తలెత్తిందని.. ఆ విషయం తాను అందరికీ చెప్పానని భ్రమపడి తనను జక్కన్న టార్చర్ చేస్తున్నారని వీడియోలో పేర్కొన్నాడు. కావాలంటే ఈ విషయంలో అతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో, సూసైడ్ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా,యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరావు వ్యవహరించిన విషయం తెలిసిందే.
https://twitter.com/bigtvtelugu/status/1895021110934319151