కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చే ప్రాధాన్యత తో తృప్తిగా ఉన్న. Mlc కావాలని అడగలేదు.. అడగను కూడా అని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించినా.. ఓడించినా లాభమే చేస్తున్నారు. ఓడిపోయాక.. నా భార్య నిర్మలకు చైర్మన్ అయ్యే వెసులుబాటు వచ్చింది. కమ్మ సామాజిక వర్గంలో 30 ఏండ్లుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్న వ్యక్తి జెట్టి కుసుమ కుమార్. ఆయనకు MLCగా అవకాశం ఇవ్వాలని సీఎం, పీసీసీ, డిప్యూటీ సీఎంలకు చెప్పిన.. మరో సారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్న అని పేర్కొన్నారు.
ఇక కమ్మ సామాజిక వర్గంకి సెటిలర్స్ కి అవకాశం ఇస్తే GHMC ఎన్నికలు… సాధారణ ఎన్నికల్లో బెనిఫిట్ అవుతుంది. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఉత్తమ్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రేవంత్ సీఎం అయ్యాడు.. పొన్నం మంత్రి అయ్యాడు. జెట్టికి MLC ఇస్తే పార్టీకి బాగుంటుంది. హైదరాబాదు లో యాక్టివ్ పాలిటిక్స్ ఉండాలని అంటే.. జెట్టికి అవకాశం ఇవ్వాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.