తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా : కిషన్ రెడ్డి

-

రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. అయితే రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు.

అయితే ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నేను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్టు రుజువు చూపించాలని సవాల్ చేస్తున్నా. చేతకాని, దమ్ములేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రోకి సంబంధించి మొన్న ప్రతిపాదనలు పంపారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు వైఖరితో వ్యవహరిస్తున్నారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు అని నెపం నా మీదకు నెడుతున్నారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news