భారత్ , పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో అటు పాక్‌లోని భారతీయులు ఇండియాకు.. ఇక్కడి పాక్ పౌరులు వారి దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అధికారులు కూడా తిరిగి దేశానికి రావాల్సిందని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడి పాక్ అధికారులను కూడా తిప్పి పంపించి వేశారు.
ఈ క్రమంలోనే ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను పాక్ సిటిజన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నానని.. తన పిల్లలకు కూడా పాకిస్తాన్ పాస్ పోర్టు ఉందని.. ఇపుడు తాను అటు ఇటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వక్తంచేశారు. ‘నేను ఇండియన్, నా భర్త పాకిస్తాన్. మా పిల్లలు ఇండియాలోనే పుట్టారు, అయితే వాళ్ళకి పాకిస్తాన్ పాస్పోర్ట్ లు ఉన్నాయి.
ఇప్పుడు ఇండియా పాస్పోర్ట్ ఉన్న నన్ను సరిహద్ది దాటనివ్వడం లేదు, నేను పాకిస్తాన్ వెళ్ళేందుకు నాకు భారత ప్రభుత్వం సహాయం చేయాలని’ సదరు మహిళ వాపోయింది.
నేను ఇండియన్, నా భర్త పాకిస్తాన్. మా పిల్లలు ఇండియాలోనే పుట్టారు, అయితే వాళ్ళకి పాకిస్తాన్ పాస్పోర్ట్ లు ఉన్నాయి.
ఇప్పుడు ఇండియా పాస్పోర్ట్ ఉన్న నన్ను సరిహద్ది దాటనివ్వడం లేదు, నేను పాకిస్తాన్ వెళ్ళేందుకు నాకు భారత ప్రభుత్వం సహాయం చేయాలి అంటున్న మహిళ.#AttariWagahBorder #UANow… pic.twitter.com/70Trzis7zU
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 25, 2025