మాాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కు విజయవాడ కోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. నటి జత్వానీ కేసులో మరింత విచారించేందుకు ఆంజనేయులు ను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ పోలీసుల అభ్యర్థనను విజయవాడ కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం కోర్టటు ఆదేశాలతో ఆయనను శని, ఆది, సోమవారం కస్టడీకి తీసుకోనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు నటి జత్వానీ కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో నిందితుడు ఆంజనేయులు ప్రశ్నించనున్నారు. ముంబై నటి జత్వానీని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కి పీఎస్సార్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఐడీ అధికారులు విచారించనున్నారు.