బీఆర్ఎస్ రజతోత్సవం సందర్బంగా గులాబీ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పది లక్షల మందితో గ్రాండ్‌గా సభ నిర్వహించాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇప్పటికే సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇదిలాఉండగా, 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… కదం కదం తొక్కుతూ వరంగల్లు సభకు యువత పాదయాత్ర చేపట్టారు. పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండా ప్రదర్శన చేపట్టినట్లు వివరించారు. ‘బీఆర్ఎస్ రజతోత్సవం.. తెలంగాణ ప్రజల విజయోత్సవం.. నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామ దండు కదిలింది. నేడు రేవంత్ అరాచకాలు ఎదిరించడానికి గులాబీ దండు కదిలింది’ అని చెప్పుకొచ్చారు.