సీఎం రేవంత్‌కు నేనే ఎక్కువ..కేసీఆర్ దాకా ఎందుకు? : పాడి కౌశిక్ రెడ్డి

-

సీఎం రేవంత్‌కు కేసీఆర్ స్థాయి వరకు ఎందుకు అని.. ఆయన సవాల్ స్వీకరించడానికి తాను చాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నిన్న స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ పై సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టిందో చర్చించడానికి పిల్ల కాకులు అయిన హరీశ్ రావు, కేటీఆర్‌లు కాదని..అసలైన కాకి కేసీఆర్ రావాలని రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. రేవంత్ స్థాయికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు! నేను ఉన్నాను కదా..రేవంత్ నీది కేవలం నా స్థాయి మాత్రమేనని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news