నేనేం మంచోడిని కాదు.. రాసిపెట్టుకోండి : కేటీఆర్

-

సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల జిల్లా యంత్రాంగం మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు నెట్టింట పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఓ సన్నాసి, ఏ కలెక్టర్ మా వెంట్రుక కూడా పీకలేడు. అధికారులు పోలీసులు కూడా ఎన్ని రోజులు ఎగిరిపడుతారో నేను కూడా చూస్తా..

నేను అసలే అంత మంచోణ్ని ఏం కాదు. రాసి పెట్టుకోండి.. మేము వచ్చాక వాళ్ళ సంగతి ఏందో చూస్తాం. ఇలాంటి అధికారులను, పోలీసులను వాడుకుని మా మీద కక్ష సాధించాలని ఈ ప్రభుత్వం చూస్తోంది. మీ వలన ఏం కాదు. ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version