మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తల అరెస్టు..రేవంత్ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కార్యకర్తల మందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఉదయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు చేసింది.

‘చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది.మాగునూరు జెడ్పీ హైస్కూల్‌లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బంధిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా..తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం’ అని ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version