మీకు నేను భరోసా ఇస్తున్నా.. అమ్జెన్ కంపెనీతో సీఎం రేవంత్

-

ప్రముఖ బయోటెక్ సంస్థ అమ్జెన్ నగరంలో న్యూ టెక్నాలజీ,ఇన్నోవేషన్ సైట్‌ను ప్రారంభించింది. సోమవారం ఉదయం హైటెక్ సిటీలో అమ్జెన్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రారంభించగా.. మంత్రి శ్రీధర్ బాబు, అమ్జెన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, అమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, అమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..అమ్జెన్ కంపెనీ రాకతో బయో సైన్స్‌ విభాగంలో హైదరాబాద్ హబ్‌గా అవతరిస్తుందని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. అమ్జెన్ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని.. ట్రిలియన్ డాలర్ జీడీపీ స్టేట్‌గా రాష్ట్రాన్ని మార్చడమే మా విజన్ అని సీఎం వివరించారు. నేను మీకు భరోసా ఇస్తున్నా.. హైదరాబాద్ ప్రపంచంలోని గొప్ప నగరాలలో ఒకటిగా అత్యంత వేగంగా అవతరించనుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news