ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లోని 13.5 కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి.
అక్కడ బురద, నీరు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిసింది. అయితే, అక్కడ పేరుకున్న బురద, మట్టిని తొలగించడానికి సుమారు 10 నుంచి 12 రోజుల సమయం పడుతుందని ఇప్పటికే సహాయకచర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతున్నారు.టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ముందు 100 మీటర్ల మేర మట్టి ఉందని పేర్కొన్నారు.అది తొలగిస్తేనే
8 మంది గురించి సమాచారం తెలుస్తుందని వెల్లడించారు. కాగా, ఆలోపు వారు ప్రాణాలతో బతికుండే చాన్స్ లేకపోవచ్చని చర్చ జరుగుతోంది.