ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున లోక్సభ ఎంపీగా గెలిచిన సురేష్ గోపి పర్యాటక, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కేరళకు తిరిగి వచ్చిన ఆయన బుధవారం ఉదయం కోజికోడ్ నగరంలోని తాలి మహాదేవ ఆలయాన్ని సందర్శించి ప్రార్ధనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తనకు పెద్ద బాధ్యత అప్పగించారని, అన్ని వర్గాల ప్రజల మద్దతు కారణంగా మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సభ్యునిగా కొత్త పాత్ర లభించిందని అన్నారు.
నాకు అప్పగించిన పనిని బాధ్యతగా చేస్తాను. ప్రజలు, దేవాలయాలతో చాలా సంబంధాలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా పాత్రకు న్యాయం చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రిగా దేశంలోని భూ భాగాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చినందుకు త్రిసూర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్లో న్యాయవాది, సీపీఎం అభ్యర్థి వీఎస్ సునీల్కుమార్పై గోపి 74,686 ఓట్ల తేడాతో విజయం సాధించారు.