రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తనకు ఎలాంటి వైరుద్ధ్యాలు లేవని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కొట్లాట అంతా రెవెన్యూ అధికారులతోనే. ప్రభుత్వ భూమిలో వంశీరామ్ మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
గత బీఆర్ఎస్ హయాంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్లకు అంటగట్టారు. నిజం ఉంటేనే నేను ఆరోపణలు చేస్తాను.ఆ భూమి తిరగి ప్రభుత్వానికి దక్కే వరకు పోరాడుతూనే ఉంటాను. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో కూడా 700 ఎకరాల భూమిని కొట్టేశారు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.