ఏపీ పోలీసులకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో.. ఎవరైతే టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తారో.. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్లని శిక్షించక తప్పదు. ఖాకీ డ్రెస్ విప్పి బయట నుంచో పెట్టడం ఖాయం’ అని తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలాఉండగా మొన్న రాప్తాడుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ సైతం పోలీసులకు ఇలాంటి వార్నింగే ఇచ్చారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు పోలీసుల బట్టలూడదీసి కొడతామని వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు సైతం అదే స్టైల్లో రియాక్ట్ అయ్యారు. మీలాంటి వారే ఇలా మాట్లాడితే కింది స్థాయి వారు ఎలా మాట్లాడుతారని..ఖాకీ చొక్కాలంటే అరటి తొక్కలు కాదని స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు.