బాబుకి కె.సి.ఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుంది..!

-

తెలంగాణ ఎన్నికల ఫలితాలు అలా వెళ్లడయ్యాయో లేదో గులాబి దళపతి కె.సి.ఆర్ దూకుడు మొదలు పెట్టేశారు కూడా. తను ఏం చెప్పదలచుకున్నా ముక్కుసూటిగా మొహం మీద చెప్పే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టి.ఆర్.ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన తరుణంలో ప్రెస్ మీట్ లో పాల్గొనడటం జరిగింది. ఇది ప్రజల విజయం అని చెప్పి ఈ విజయం గర్వం పెంచకుండా బాధ్యత, బరువుని పెంచాయని ప్రజల మెప్పు పొందారు.

ఇక టి.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ మహాకూటమికి సపోర్ట్ గా ప్రచారం చేసిన చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తానని చెప్పారు కె.సి.ఆర్. ఇంతకీ బాబుకి కె.సి.ఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి.. అది ఎలా ఉండబోతుంది. ఆయన ఏపి రాజకీయాల మీద అన్నాడా.. లేక ఫస్ట్ ఫ్రెంట్ అంటూ కూటమి అంతుచూసేలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా తెలంగాణా ప్రజలు మరోసారి కె.సి.ఆర్ ను ఆశీర్వదించారు. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నది కాస్తా వార్ వన్ సైడే అన్నట్టుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడడిన ప్రభుత్వంగా టి.ఆర్.ఎస్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version