కరణ్ జోహార్ :నాకు అదంటే *** చాలా ఇష్టం, అందుకే.!

-

కాఫీ విత్ కరణ్ టాక్ షో చూట్టూ వున్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. ఎంత మంది గొల చేసినా తాను చేసేది చేస్తూ, అడిగేది అడుగుతూనే వున్నాడు. ఈయన షో వల్ల కొంత మంది క్రికెటరల కెరియర్ కూడా దెబ్బతింది. చాలా మంది కాపురాల్లో నిప్పు పెట్టాడు, హీరోల ఇమేజ్ డామేజ్ చేసాడు. ప్రస్తుతం తన కాఫీ విత్ కరణ్ టాక్ షో ఏడో సీజన్ పూర్తి చేశాడు. ఇది యదావిధిగా మంచి రేటింగ్ రాబట్టింది. గత ఎపిసోడ్స్ లాగానే ఇందులొ సెక్స్ గురించి ,మంచి మసాలా ప్రశ్నలు అడిగాడు.ఇలా అడగడం చాలా మందిని ఇబ్బంది పెట్టింది.

దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా మనోడు ఎక్కడా తగ్గడం లేదు.అయితే  తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ దీనికి సంబంధించిన ప్రశ్నకు తనదైన శైలిలో లో సమధానం చెప్పాడు.కరణ్ మాట్లాడుతూ అది నా స్వంతషో, ఇతరుల లైంగిక జీవితాల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నానని అందరూ విమర్శలు చేస్తున్నారు. అది ఎక్కువ శాతం నిజమేనేమో, వేరే వాళ్ళు సెక్స్ పట్ల ఎలా వుంటారు అనే ఆసక్తి అందరిలాగే నాకూ వుంది. అందుకే నా దగ్గరకు వచ్చిన వారిని నా ఇంట్రెస్ట్ ప్రకారం ప్రశ్నలు అడుగుతూ వుంటాను అని సమధానం ఇచ్చాడు.

జనాలకు ఆసక్తి లేక పోతే నా షో చూడరు కదా,అందుకే వారికి ఇష్టమైన  ప్రశ్నలు వేస్తుంటాను. నాకు ఆటైమ్ లో ఏది అడగాలి అని అనిపిస్తే అది అడుగుతూ వుంటాను. అంతేకానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోను అని చెప్పుకొచ్చాడు.కానీ కొందరు మాత్రం లోకంలో  వేరే సమస్యలు లేనట్లు నా షో మీదనే దృష్టి పెట్టి ఏదేదో మాట్లాడుతువుంటారు. అయినా వాటిని పట్టించుకునే స్థితిలో నేను లేను అని గట్టిగానే బదులిచ్చారు. అలాగే త్వరలోనే తన కాఫీ విత్ కరణ్ 8వ  కొత్త సీజన్ తో రాబోతున్నట్లు ప్రకటించాడు. ఏది ఏమైనా మనోడు తగ్గేదెలా అంటున్నాడు గా.!

 

Read more RELATED
Recommended to you

Exit mobile version