క్రికెట్ అభిమానులకి ఐసీసీ శుభ వార్త..?

-

క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.జూన్‌ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.గ్రూప్ స్టేజ్, సూపర్ 8 దశలో కనీసం 5 ఓవర్లు, సెమీస్, ఫైనల్స్లో కనీసం 10 ఓవర్లపాటు సెకండ్ ఇన్నింగ్స్ జరిగితేనే ఇది వర్తిస్తుంది.ఇక జూన్ 5వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో జరగనుంది.

కాగా, ఈ t 20 ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను ఐసీసీ 4 గ్రూపులుగా విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version