ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ టోర్నీ షెడ్యూల్ ను ఐసీసీ తన వెబ్ సైట్ లో విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న న్యూలాండ్స్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరగనుంది. మొత్తం టాప్ 10 జట్లు టోర్నీలో తలపడనున్నాయి.
15 రోజుల పాటు కేప్ టౌన్, పార్ల్, జెబెర్హా వేదికలుగా 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్ల ధరలు 60 ర్యాండ్లు (275 రూపాయలు) నుంచి ప్రారంభమవుతాయని, ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్రీ టికెట్ అని ఐసీసీ చెప్పింది. ఫిబ్రవరి 26న న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆఫ్రికన్ వేడుకలతో ఫైనల్‌ను ప్రత్యేకంగా నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ఈ మ్యాచ్‌కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రత్యేక అతిథిగా రానున్నట్లు పేర్కొంది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ :
- 10 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs శ్రీలంక, కేప్ టౌన్
- 11 ఫిబ్రవరి, వెస్టిండీస్ vs ఇంగ్లాండ్, పార్ల్
- 11 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, పార్ల్
- 12 ఫిబ్రవరి, భారత్ vs పాకిస్థాన్, కేప్ టౌన్
- 12 ఫిబ్రవరి, బంగ్లాదేశ్ vs శ్రీలంక, కేప్ టౌన్
- 13 ఫిబ్రవరి, ఐర్లాండ్ vs ఇంగ్లాండ్, పార్ల్
- 13 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్, పార్ల్
- 14 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, జెబెర్హా
- 15 ఫిబ్రవరి, వెస్టిండీస్ vs ఇండియా, కేప్ టౌన్
- 15 ఫిబ్రవరి, పాకిస్థాన్ vs ఐర్లాండ్, కేప్ టౌన్
- 16 ఫిబ్రవరి, శ్రీలంక vs ఆస్ట్రేలియా, జెబెర్హా
- 17 ఫిబ్రవరి, న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్, కేప్ టౌన్
- 17 ఫిబ్రవరి, వెస్టిండీస్ vs ఐర్లాండ్, కేప్ టౌన్
- 18 ఫిబ్రవరి, ఇంగ్లండ్ vs ఇండియా, జెబెర్హా
- 18 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, జెబెర్హా
- 19 ఫిబ్రవరి, పాకిస్థాన్ vs వెస్టిండీస్, పార్ల్
- 19 ఫిబ్రవరి, న్యూజిలాండ్ vs శ్రీలంక, పార్ల్
- 20 ఫిబ్రవరి, ఐర్లాండ్ vs ఇండియా, జెబెర్హా
- 21 ఫిబ్రవరి, ఇంగ్లాండ్ vs పాకిస్థాన్, కేప్ టౌన్
- 21 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, కేప్ టౌన్
- 23 ఫిబ్రవరి, సెమీ-ఫైనల్ 1, కేప్ టౌన్
- 24 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్
- 24 ఫిబ్రవరి, సెమీ-ఫైనల్ 2, కేప్ టౌన్
- 25 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్
- 26 ఫిబ్రవరి, ఫైనల్, కేప్ టౌన్
- 27 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్