ఢిల్లీలో నిండిపోతున్న ఐసియు బెడ్ లు.. ఎందుకో తెలుసా..!

-

మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ దేశ రాజధాని ఢిల్లీలో క్రమక్రమంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ వాసులు అందరూ ప్రస్తుతం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు మరోసారి రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతుంది. దీంతో నగరంలోని ఆసుపత్రులలో కూడా ఐసియు బెడ్లు పూర్తిగా నిండి పోతూ ఉండడంతో ప్రస్తుతం మరింత ఆందోళనకు దారి తీస్తోంది.

దీంతో ఎంతో మంది తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. విత్ వెంటిలేటర్ వితౌట్ వెంటిలేటర్ ఐసియు బెడ్ లు ఖాళీగా లేకపోవడం అని కూడా పూర్తిగా రోగులతో నిండిపోవడంతో ప్రస్తుతం కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్న రోగులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అయోమయంలో పడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version