మణికొండ లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మ్యాన్ హోల్ లో గల్లంతైన రజనీకాంత్ కోసం దాదాపు 10 గంటలుగా గాలిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో డీఆర్‌ఎఫ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొంది. అయితే… తాజాగా.. మణికొండ నాలాలో గల్లంతైన వ్యక్తి రజనీకాంత్ గా గుర్తించారు డీఆర్‌ఎఫ్ అధికారులు. షాద్ నగర్ లోని ఓ పవర్ ప్లాంట్ లో ఇంజినీర్ గా రజనీకాంత్ పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు అధికారులు.
నిన్న మణికొండ లోని మ్యాన్ హోల్ లో గల్లంతైన రజనీ కాం త్… ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. కాగా.. అటు మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద నాలాను పరిశీలించారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి.. మణికొండలో జరిగిన ఘటన బాధాకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు..ఇలా జరగాల్సింది కాదని… నాలాల నిర్మాణం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ డ్రయినేజి, నాలాల నిర్మాణాలు జరిగినా, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మణికొండ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని… బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.