సీఎం జ‌గ‌న్ అనుకుంటే.. మ‌ళ్లీ మంత్రి అవుతా : బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మంత్రులు కాసేప‌టి క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన అనంత‌రం బొత్స స‌త్య నారాయ‌ణ తొలి సారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా బొత్స స‌త్య నారాయ‌ణ‌ కొత్త కేబినెట్ గురించి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ నాయ‌కత్వంలో రెండున్న‌ర ఏళ్ల పాటు మంత్రిగా బాధ్య‌తలు చేయ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. తాను ఇప్ప‌టికి మూడు సార్లు మంత్రిగా చేశాన‌ని అన్నారు.

కానీ ఈ సారి ఛాలేజింగ్ గా ఉంద‌ని తెలిపారు. అలాగే రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత కేబినెట్ ను మారుస్తామ‌ని సీఎం జ‌గ‌న్ గ‌తంలోనే చెప్పార‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని అన్నారు. త‌ర్వ‌త సీఎం జ‌గ‌న్ ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. నిర్వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్నానని స్ప‌ష్టం చేశారు. త‌మ ముందు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యం.. 2024లో వైసీపీని మ‌రో సారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే అని అన్నారు.

కాగ త‌న‌కు మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి.. సీఎం జ‌గ‌న్ అనుకుంటే వ‌స్తుంద‌ని అన్నారు. కొత్త కేబినెట్ లో ఎవ‌రెవ‌రు ఉంటారో సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని అన్నారు. కాగ పాత మంత్రుల్లో ఐదుగురు కొత్త కేబినెట్ లో ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్తలు వ‌స్తున్నాయి. అందులో బొత్స స‌త్య నారాయ‌ణ కూడా ఉన్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version