ఈరోజుల్లో మధుమేహం అనేది నాలుగింట ముగ్గురికి ఉండే వ్యాధి అయిపోయింది. కుటుంబసభ్యుల్లో ఎవరోఒకరైనా దీనితో బాధపడుతున్నారు. తాజా అధ్యయనంలో దీని గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మధుమేహం కుక్కలకు ఉంటే..వాటి యజమానులపై దీని ప్రభావం గట్టిగా ఉంటుందట. ప్రమాదం ఇద్దరిలో ఒకే రకంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది.
ర్యాండమ్ గా కొన్ని సెలక్ట్ చేసుకుని వ్యాధిగ్రస్థుల ఆరోగ్య రికార్డులను బట్టి ఈ పరిశోధన కొనసాగించారు. ఈ బృందం 2,08,908 మంది యజమానుల్ని వారి శునకాల జంటల డేటాను పరిశీలించారు. ఇందులో తెలిసింది ఏమంటే, ఆరోగ్యకరమైన శునకాలను పెంచుకుంటున్న యజమానుల కంటే మధుమేహమున్న శునకాలను పెంచుకుంటున్న యజమానులకు టైప్ 2 డయాబెటీస్ రావడానికి 38 శాతం అవకాశముందని తేలింది. ఇదే క్రమంలో 1,23,566 మంది యజమానులను, పిల్లుల జంటలనూ పరిశోధనకు సేకరించారు. వాటి తారతమ్యాన్నీ గమనించారు. అయితే శునకాల కంటే పిల్లులూ వాటి యజమానులకు మధ్య ఈ డయాబెటీస్ రిస్కు అంతగా లేనట్లు గుర్తించారు.
ప్రచురించిన రిపోర్టు చెబుతున్నదాని ప్రకారం, శునకాల్లో, పిల్లుల్లో మధుమేహ ప్రభావం నానాటికీ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, రెండు జంతువుల్లోనూ ఆహారపు అలవాట్లు, వాటివల్ల ఏర్పడే ఒబేసిటీ అనేవి టైప్ 2 మధుమేహం కలిగించే ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి అథ్యయనాల నేపధ్యంలో బిట్రైస్‌తో పాటు ఆమె బృందం కూడా నమ్ముతున్నది ఏమంటే, ఇద్దరి శారీరక కార్యకలాపాల స్థాయిలను బట్టి మధుమేహం కూడా ఇద్దరి మధ్య ఒకేసారి అభివృద్ధి అయ్యే ఆవకాశమున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పిల్లులు, వాటి యజమానులు కలిసి వ్యాధుల ప్రమాదాలను పంచుకునే అవకాశం తక్కువగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఒకటి వాటి వైవిధ్యమైన కదలికల అలవాట్లని చెప్పొచ్చు. పిల్లులు సాధారణంగా వాటి యజమానుల నుంచి స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతాయి.
ముఖ్యంగా అవి అటూ ఇటూ తిరిగాలని అనుకుంటాయి. యజమానులు కూడా కుక్కలను ముద్దాడినట్లు పిల్లులను అంతగా దగ్గరకు తీసుకోరు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వాటిని ఎత్తుకుని ఆడుకుంటారు. శునకాలు, వాటి యజమానులు రసాయనాల, కాలుష్య పదార్థాల ప్రభావానికి లోనయినపుడు ఇద్దరిపైనా వాటి ప్రాభల్యం ఉంటుందంటారు బీట్రైస్.అంటే..ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుందికానీ..ఎవరికి ఎంత స్థాయిలో అవుతుందనే విషయం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందట.
రిపోర్టు ప్రకారం అయితే శునకాలకు, యజమానులకు మధ్య దాగున్న ఈ కారకాన్ని కచ్ఛితంగా చెప్పలేదు. ఈ అధ్యయనం ఇంకా పరిశీలనాంశంగానే పరిగణించబడింది. అయితే ఈ అధ్యయనం అనేది శునకాలకు, వాటి యజమానులకు మద్య టైప్ 2 మధుమేహం రావడానికి గల సంబంధాన్ని మాత్రమే తెలియజేస్తోంది.మీ ఇంట్లో కూడా కుక్కలు ఉన్నట్లైతే..వెంటనే వాటికి డయాబెటీస్ టెస్ట్ చేయించి..ప్రమాదాన్ని ముందే పసిగట్టండి.