జన్ ఔషధి సెంటర్ ప్రారంభిస్తే.. 20 శాతం కమీషన్.. వేలల్లో సంపాదన.. ఎలాగో తెలుసా..?

-

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా పేదలకు తక్కువ ధరలో మెడిసిన్స్ అందిస్తోంది. జన్ ఔషధి దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే ఎనిమిది నెలల్లో 2500 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత నెలలోనే 7500 మెడికల్ షాపులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ మెడికల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే రూ.7 లక్షల వరకు సహకారం అందిస్తోంది. మెడికల్ షాపులు పెట్టుకోవాలని అనుకునే వారికి ఇదో మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. అయితే జన్ ఔషధి కేంద్రాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.. ఎంత కమిషన్ వస్తుంది.. దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం.

జన్ ఔషధి యోజన

ఈ పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది లబ్ధి పొందుతున్నారు. మెడిసిన్స్ అమ్ముతూ ప్రతిరోజు రూ.వేలల్లో సంపాదిస్తున్నామని బీహార్ భాగల్పూర్‌కు చెందిన జన్ ఔషధి కేంద్ర నిర్వాహకుడు అభిజీత్ తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తేస్తున్నారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ కేంద్రాలకు ప్రాముఖ్యత పెరిగింది. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకు జనరిక్ మందులు ఈ షాపుల్లో దొరుకుతాయి.

రూ.7 లక్షల వరకు ప్రోత్సహకాలు..
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించాలనుకుంటే కేంద్రం మీకు రూ.5 లక్షల వరకు ప్రోత్సహకాలు అందిస్తోంది. అదే పట్టణ ప్రాంతమైతే.. అదనంగా మరో రూ.2 లక్షలు అందిస్తుంది. మహిళలు, వికలాంగులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారికి రూ.7 లక్షల ప్రోత్సహకాలు అందిస్తోంది. ఈ పథకం కింద.. మెడికల్ షాపు ఓపెన్ చేయడానికి, ఫర్నీచర్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.1.5 వరకు డబ్బులు చెల్లిస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్స్, బిల్లింగ్ వంటి వాటి కోసం మరో రూ.50 వేలు సాయం అందిస్తుంది.

20 శాతం కమీషన్.. దరఖాస్తు ఇలా..?
జన్ ఔషధి కేంద్ర నిర్వాహకుడికి మెడిసిన్స్, ఔషధాల అమ్మకంపై 20 శాతం కమీషన్ వస్తుంది. దీంతోపాటు ప్రతినెల అమ్మకాలపై 15 శాతం ప్రోత్సహకాలు అందజేస్తారు. దీంతో మీరు వేలల్లో సంపాదించుకోవచ్చు. ఈ మెడికల్ షాపునకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే.. వైద్యడు, ఫార్మాసిస్ట్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. ట్రస్ట్, ఎన్‌జీఓ, ప్రైవేట్ ఆస్పత్రి, స్వయం సహాయక బృందం మొదలైన వాటి ద్వారా కేంద్రాలను ప్రారంభించుకోవచ్చు. మొదటగా జన్ ఔషధి కేంద్రం పేరిట రిటైల్ డ్రగ్ అమ్మకాలపై లైసెన్స్ పొంది. దీని కోసం అధికారిక వెబ్‌సైట్ http://janaushadhi.gov.in/online_registration.aspx కు లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడు రూ.5 వేలు చెల్లించి మీ పేరును రిజిస్టర్డ్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version