కీర్తి సురేష్ సినిమా ఒప్పుకోవాలంటే.. అవి ఉండాల్సిందే..!!

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేనక కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఆ తర్వాత మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస అవకాశాలను అందుకుంటోంది. మొదటగా మలయాళం చిత్రం గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత తెలుగు , తమిళ్ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఈమె నటించిన మహానటి సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది . ఇక తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ఒక రకంగా కెరియర్ ను నాశనం చేస్తుందని చెప్పవచ్చు.

ఇక ఈమె నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు దారుణమైన పరాజయాన్ని చవిచూశాయి. ఇక తర్వాత నితిన్ కి జోడిగా వచ్చిన రంగ్ దే సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తర్వాత మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ కీర్తి సురేష్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది.. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తాను సినిమాలలో నటించాలంటే అవి ఉండాల్సిందే అంటూ స్పష్టం చేసింది.

ఏదైనా ఒక సినిమాకు సైన్ చేయాలంటే హీరోయిన్ హోదా ఒక్కటే సరిపోదు.. హీరో, దర్శకుడు , తన క్యారెక్టర్.. కథలోని ఫీల్ అన్నీ కూడా ముఖ్యమని.. అవన్నీ పరిశీలించాకే సినిమా ఎంపిక చేసుకుంటానని తెలిపింది . దీన్ని బట్టి చూస్తే తనతో సినిమాకు సైన్ చేయించుకోవడం దర్శక నిర్మాతలకు అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పింది మహానటి. ఇక ప్రస్తుతం తమిళ్లో ఉదయ నిధి స్టాలిన్ హీరోగా వస్తున్న మా మన్నన్ అనే సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లో ఈమె నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version