తెలంగాణ ప్రభుత్వంలో బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వ ఆఫీసులకు తాళాలు వేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా తనకు రావాల్సిన బిల్లులు చెల్లించడం లేదని తహసీల్దార్ కార్యాలయానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు.
భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన బిల్లు ఇంకా ఇవ్వలేదంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం గేటుకి తాళం వేసి దానయ్య అనే కాంట్రాక్టర్ నిరసన తెలిపారు.చాలా కాలంగా బిల్లుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని దానయ్య ఆరోపించారు. దీంతో విసిగిపోయి ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసినట్లు ఆయన వెల్లడించాడు.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. వీడియో వైరల్ అవుతోంది.
బిల్లులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ దానయ్య
భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన బిల్లు ఇంకా ఇవ్వలేదంటూ గేటుకి తాళం వేసి నిరసన తెలిపిన దానయ్య pic.twitter.com/KDOXavSZYx
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025