ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే..నాలుగేళ్లలో కోటికి పై రాబడి..

-

ఎల్ఐసీ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలను అందించేలా పాలసీలను అందిస్తుంది.ప్రతి వర్గానికి చెందిన వారికి, జెండర్‌, వయసు, ఆర్థిక నేపథ్యం ఆధారంగా క్యూరేటెడ్ పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వారికి బెస్ట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అందించడంతోపాటు, హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ కోసం కూడా పాలసీలను రూపొందించింది. అనిశ్చిత సమయాలను ఎదుర్కోవడానికి HNIలు మంచి ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవడం అవసరం. అంతేకాకుండా ఎల్‌ఐసీ పాలసీ వడ్డీ రేటు స్టాక్ మార్కెట్ పై ఆధారపడి ఉండదు.మార్కెట్‌ వోలటైల్‌ గా ఉన్నప్పుడు ఎల్‌ఐసీ బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ అనేది HNIల కోసం కంపెనీ ప్రారంభించిన అత్యంత ఉపయోగకరమైన పాలసీ..

ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు..

ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవింగ్స్ ప్లాన్. ఇది లిమిటెడ్‌ ప్రీమియం పేమెంట్‌ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది మినిమమ్‌ బేసిక్ సమ్ రూ.1 కోటి అందిస్తుంది. ప్రత్యేకించి హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ లక్ష్యంగా ఈ పాలసీ రూపొందింది. ఈ ప్లాన్‌ కింద మొదటి ఐదేళ్లలో గ్యారంటీడ్‌ అడిషన్స్‌, థౌజండ్‌ బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ పెర్‌ రూ.50గా ఉంటుంది. అదే 6వ పాలసీ సంవత్సరం నుంచి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే వరకు రూ.55గా ఉంటుంది. పాలసీ లాయల్టీ పార్టిసిపేట్‌ రూపంలో మంచి రాబడిని ఇస్తుంది.

ఈ ప్లాను ను పొందేందుకు పాలసీదారుడుకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 55 ఏళ్లు, వీరికి పాలసీ టర్మ్ 14 ఏళ్లు ఉంటుంది. 51 ఏళ్లు ఉన్న వారికి పాలసీ టర్మ్ 16 ఏళ్లు, 48 ఏళ్లు ఉన్నవారికి పాలసీ టర్మ్ 18 ఏళ్లు, 45 ఏళ్లు ఉన్నవారికి పాలసీ టర్మ్ 20 ఏళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుకు 69 సంవత్సరాలు మించి ఎక్కువ ఉండకూడదు..

ఈ పాలసీ రూ.1 కోటి ప్రాథమిక హామీ మొత్తాన్ని అందిస్తుంది. పాలసీదారుడు ఈ పాలసీలో నాలుగేళ్లపాటు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత అతను లేదా ఆమె రాబడిని పొందుతారు. ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ నాలుగు వేర్వేరు నిబంధనలలో- 14, 16, 18, 20 సంవత్సరాలలో మెచ్యూర్‌ అవుతుంది. ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ ప్రయోజనాలను పొందేందుకు పాలసీదారు ప్రతి నెలా దాదాపు రూ.94,000 ప్రీమియం చెల్లించాలి. ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ కింద లోన్‌ పొందే సదుపాయం కూడా ఉంది. కనీసం ఒక పూర్తి సంవత్సరం ప్రీమియం చెల్లించిన అనంతరం కొన్ని కండిషన్లతో లోన్ కూడా పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version