సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఎట్టకేలకు స్పందించారు. కూటమి ప్రభుత్వం, ఏపీ చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఆమె విరుచుకపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో నంది అవార్డులు ఒకే వర్గం వారికి ఇస్తున్నారని, తనకు వచ్చిన అవార్డును అందుకే తిరస్కరిస్తున్నట్లు పోసాని పేర్కొనగా.. ఆ విషయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు కేసు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు చర్యల వలన సీనియర్ ఎన్టీఆర్, తాను, వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ సైతం ఎంతో ఇబ్బంది పడ్డారని ఆమె గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ‘తండ్రి కొడుకులకు ఎలానో బుద్ధి లేదు..ఇప్పటి దాకా నీకైనా ఉంది అనుకున్నాం పవన్ కళ్యాణ్’ కానీ ఇప్పుడు నీక్కుడా లేదని అర్థమైందంటూ ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/greatandhranews/status/1896094252578587100