భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొంపెనగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా.. ఆరుబయట పడుకున్న ఇద్దరు యువకుల పైనుంచి ఇసుక ట్రాక్టర్లు వెళ్లడంతో యువకులు మృతి చెందారు.
అక్రమ ఇసుక రవాణా వలన ఇద్దరు యువకులు ప్రాణాలు పోవడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 24 గంటల ఇసుక రవాణా కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలో అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, తమ ప్రాణాలు కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1895806938882904488