స్ఫూర్తి: వయస్సు చిన్నదైతేనేం..! మనసు విశాలం….

-

జీవితమంటే కష్ట సుఖాల సమరం. జీవితం లో రాణించడం ఒక యుద్ధం. ప్రతి రోజు నిజంగా సమరం లాగే ఉంటుంది. ఏ క్షణం దుఃఖము ఉంటుందో.. ఏ క్షణం ఆనందంగా ఉంటుందో… ఎవరూ ఊహించలేరు. ఇదే ప్రతి ఒక్కరి జీవితం. అలానే సురేష్ కూడా తన జీవితాన్ని ఎంతో ఆనందంగా.. కొన్ని ఇబ్బందులతో నెట్టుకొస్తున్నాడు. తాను సాదాసీదా మనిషి. ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆడవాళ్లు కూడా ఈ రోజుల్లో మగవారితో సమానంగా రాణిస్తుండడం చూస్తున్నాం. సురేష్ భార్య కూడా ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. తానూ కూడా తన భర్త వల్లే ప్రతిరోజు కష్టపడుతూ వేడి నీళ్ళకి చన్నీళ్ళై తోడుగా ఉంటోంది. ఇలా వాళ్ళిద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నారు.

పెద్దబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు. చిట్టి చెల్లి రెండవ తరగతి చదువుతోంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం, మంచి విషయాలు ఎన్నో చెప్పడం, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం, ప్రోత్సహించడం చేస్తూ ఉంటాడు సురేష్. స్కూలు అయిపోయిన తర్వాత ఇంటికి రావడం తమ పిల్లలతో సరదాగా గడపడం, కబుర్లు చెప్పడం, మంచి మంచి కథలు చెప్పడం చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న కరోనా వీళ్ళని చిక్కుల్లోకి నెట్టేసింది. పాఠశాలలు తెరుచుకోకపోవడంతో ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లోనే ఉండటం మనకి తెలిసినదే. అయితే కరోనా విసిరిన పంజాకి సురేష్ జీవితం ముక్కలైపోయింది. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలి అనేది సురేష్ దంపతులకి తోచలేదు.

ఇప్పుడే పరిస్థితి మెరుగు పడదని గ్రహించి, కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదని కూరగాయల వ్యాపారం మొదలు పెట్టాడు. ఇంటింటికి బండి మీద కూరగాయలు అమ్ముకోవడం చేస్తున్నాడు సురేష్. ఒకనాడు సురేష్ క్లాస్ లో విద్యార్థులు ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయారు సురేష్ దంపతులు. మాస్టారు మీకు మేము సాయం చేస్తాం అని కలెక్ట్ చేసిన డబ్బులు,  కిరాణా సామాన్లు తీసుకొచ్చారు. సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వయసు చిన్నదైనా మనసు పెద్దది అని ఎంతో ఆనందపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version