సహజంగా మనం బయటకొనే ఆహార పదార్ధాలలో వెండి రంగు లో ఉండే కాగితంని ఉపయోగిస్తారు. బేకరీ ఉత్పత్తులు, చికెన్ కబాబ్స్, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ ఇలా అనేక ఆహార పదార్ధాలని మనం అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఇవ్వడం చూస్తాం. మరి ఆ అల్యూమినియం ఫాయిల్ వల్ల మనకి ఏమైనా నష్టాలూ కలుగుతాయా…? మరి దాని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.
దీని కారణంగా ప్రమాదం కలుగుతుంది. ఇది అల్జీమర్స్, ఎముకల సంబంధ వ్యాధులు, మూత్రశాయ అనారోగ్యాలు, మెదడు కణాల పనితీరు దెబ్బతినడం ఇలా కొన్ని రోగాలకు దారితీస్తుంది. అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువగా వాడితే పైన చెప్పిన వ్యాధులు దీర్ఘకాలంలో వస్తాయట. కనుక దీనిలో దృష్టిలో పెట్టుకుని వీటికి బదులుగా వేరే పద్ధతులని అనుసరించడం మేలు. ఒకవేళ మీరు కనుక ఈ ఫాయిల్స్ ని రెగ్యులర్ గా వాడుతుంటే ఈ అలవాటుని మార్చుకోండి. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త..!