విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివారని, అందుకే పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు.ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఏడాదికో నేతకు పంచుతారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిహార్ పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈడీ దాడుల పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
”ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా విపక్ష నేతలు ఎందుకు గొంతు చించుకుంటున్నారో నేను చెప్తాను. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం ఓ స్కూల్ బ్యాగులో దాచిన రూ.35లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగ,మేం అధికారంలో వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు దాదాపు రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును బట్టబయలు చేసింది అని తెలిపారు. ఆ నోట్ల గుట్టలను తరలించాలంటే కనీసం 70 చిన్న ట్రక్కులు కావాలి అని అన్నారు. రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే” అని మోదీ తెలిపారు.