అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటేసేందుకు జనం అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి.పల్నాడు జిల్లా రెంటచింతల మండల పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జెట్టిపాలెంలో పోలింగ్ కొనసాగుతుండగానే ఉన్నట్టుండి ప్రధాన పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ విషయంలో పోలింగ్ సిబ్బందితో గొడవడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏకంగా పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో జెట్టిపాలెం గ్రామంలో పూర్తిగా పోలింగ్ ను నిలిపివేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుంది.. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది సంచలనంగా మారింది.