మార్చి 31 లోపు ఆ పని చెయ్యకుంటే ఆ ఖాతాలు క్లోజ్..ఏవంటే?

-

మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి ఎండ్ అని అందరికి తెలుసు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.. ఈ మేరకు కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబందించిన అప్డేట్స్ చేసుకోవాలి.. లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది లేదా అకౌంట్స్ క్లోజ్ అవుతాయి..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉంటే.. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్బు డిపాజిట్ చేయలేకపోతే, ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మార్చి 31 వరకు మాత్రమే ఛాన్స్ ఉంది.. ఆ తర్వాత అకౌంట్ క్లోజ్ అవుతుంది..అందుకే అందులో డబ్బులను జమ చెయ్యాల్సి ఉంది..మీరు కనీస అవసరమైన మొత్తాన్ని జమ చేయకపోతే, వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ పథకాలలో కనీస పెట్టుబడిని కొనసాగించాలి. మీరు ఖాతాలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తాన్ని జమ చేయాలి..

ఆ ఖాతాల గురించి పూర్తి వివరాలు..

పీపీఎఫ్ ఖాతాదారులకు కనీస డిపాజిట్ రూ. 500లు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మీ ఖాతా మూసివేసే ఛాన్స్ ఉంది. ఇందులో డబ్బును జమ చేసేందుకు చివరి తేదీ 31 మార్చి 2023 అని గుర్తుంచుకోండి. కాబట్టి, మీరు ఈ మినిమమ్ బ్యాలెన్స్‌ను ఈ తేదీలోపు జమ చేయాలి. చివరి తేదీ వరకు మీరు డబ్బును డిపాజిట్ చేయకపోతే, మీరు సంవత్సరానికి రూ. 50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ఖాతాకు ప్రస్తుతం 7.1 వడ్డీ వస్తుంది..

అలాగే సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా ఉంటే, మీరు ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే, రూ. 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రస్తుతం 7.6% వడ్డీని అందిస్తోంది.. ఆదే విధంగా ఆధార్ కార్డు పాన్ లను లింక్ చెయ్యని వాళ్ళు వెంటనే చెయ్యండి.. లేకుంటే భారీ జరిమానాకు గురవ్వాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version