చైనా కొంపముంచిన జీరో కొవిడ్ వ్యూహం.. 3 లక్షల మంది మృతి!

-

చైనాలో మూడు లక్షల కరోనా మరణాలు నమోదైనట్లు సమాచారం. అయితే ఇంతమంది మరణానికి కొవిడ్‌ను నియత్రించడానికి తీసుకొచ్చిన ‘జీరో కొవిడ్’ విధానాన్ని హఠాత్తుగా చైనా ఎత్తివేయడం కారణమైందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం వల్ల గతేడాది డిసెంబర్‌లో జీరో కొవిడ్‌ విధానానికి చైనా ముగింపు పలికింది.

అయితే హఠాత్తుగా దీన్ని ఎత్తివేయకుండా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి, యాంటీ వైరల్‌ ఔషధాల స్టాక్‌ ఉంచుకున్నట్లయితే 2 నుంచి మూడు లక్షల మరణాలను చైనా నివారించగలిగేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీరో కొవిడ్ విధానం ఎత్తివేసిన ఆరు వారాల్లోనే 80శాతం మందికి కొవిడ్‌ వేగంగా వ్యాపించినట్లు చైనా వ్యాధుల నియంత్రణ సంస్థ అంచనా వేసింది. దీని కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా చైనా మాత్రం 90 వేల మంది మాత్రమే మరణించినట్లు చెబుతోంది. జీరో కొవిడ్‌ విధానం ఎత్తివేసే నాటికి చైనాలోని ఆసుపత్రులలో తగినంత వైద్య సిబ్బంది, వైద్య సామగ్రి, సరైన వసతులు కూడా లేవని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించిదని చైనా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version