ఐటీ ఉద్యోగులే లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయ్..రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

-

దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. తనును ఒక ఐటీ ఉద్యోగి అని తక్కువ చేసి మాట్లాడాలనుకునే వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఐటీ ఉద్యోగుల విద్యార్హత, వారి నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ పొలిటికల్ లీడర్స్ సరితూగరని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు.

గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఐటీ సెక్టార్‌లో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్ళకు, అన్నాదమ్ముళ్ళకు సలాం.. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నుముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయని, నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version