మమ్మల్ని గెలిపిస్తే మద్దతు ధర ఇస్తాం: రాహుల్ గాంధీ

-

కనీస మద్దతు ధర కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు.కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా,సంయుక్త కిసాన్‌ మోర్చాతో పాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు నిర్మించారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు. తమకు ఓట్లు వేసి కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తే కనీస మద్దతు ధర కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయంతో 15కోట్ల రైతు కుటుంబాల జీవితాలు మారతాయని ఆయన ట్వీట్ చేశారు.న్యాయమార్గంలో కాంగ్రెస్ మొదటి హామీ ఇదే అని ఆయన హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా మల్లికార్జున్ ఖర్గే కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version