శృంగారం లేకపోతే కపుల్స్ మధ్య అస్సలు సఖ్యత ఉండదు. ఇదేదో ఆషామాషీగా అంటున్న మాటలు కావు. ఎన్నో పరిశోధనలు చేసి మరి నిపుణులు చెబుతున్నారు. శృంగారం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అందుకే చాలా మంది నిపుణులు భార్యాభర్తలకి పడడం లేదని అనగానే ముందుగా వారి లైంగిక జీవితం ఎలా ఉందని ఆరా తీస్తారు. మరి అలాంటి శృంగారాన్ని జంటలు నిర్లక్ష్యం చేస్తే అసలు ఏమేం నష్టాలు జరుగుతాయో అన్నీ తెలుసుకోండి..
శారీరకంగా, మానసికంగా చాలా సమస్యల్ని దూరం చేస్తుంది చక్కని కలయిక. ప్రజెంట్ చాలా మంది రొమాన్స్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మ్యారేజ్‌కి ముందు రొమాన్స్‌పై ఉన్న ఇష్టం.. ఆ తర్వాత ఉండడం లేదు. దీని వల్ల కపుల్స్ మధ్య చాలా సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటికి రొమాన్స్‌లెస్ కాపురాలే కారణాలని తెలుస్తోంది. శృంగారం లేని జీవనం కారణంగా సమస్యలు వస్తాయట..అవేంటో ఇప్పుడు చుద్దాము..
రొమాన్స్ లేని కారణంగా కపుల్స్‌కి డిప్రెషన్ పెరుగుతుందట. రోజురోజుకి ఈ ఒత్తిడి తీవ్రంగా మారి వారి మానసిక సమస్యలకి మూలకారణమవుతుంది. అందుకే ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు నిపుణులు. దంపతులు ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతుంటే దానికి కారణంగా రొమాన్స్ లేకపోవడమే అని కూడా అనుకోవచ్చు..శృంగారమనేది మనలోని అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది. పార్టనర్స్ శృంగారానికి ఇష్టపడకపోతే అది వారి ఆత్మగౌరవంపై ఎక్కువగా ప్రభావం చూపి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందట…
ఆ కలయిక తర్వాత ఏంచక్కా నిద్రపోతారు. అది కూడా గాఢ నిద్ర. దీనికి కారణం ఒంట్లోని మజిల్స్ అలసిపోవడమే. మరి శృంగారం లేకపోతే అలాంటి నిద్ర ఎక్కడ ఉంటుంది చెప్పండి. దీంతో నిద్రలేమి ఎదురవుతుంది. దీని కారణంగా కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి..అందుకే భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న గొడవలు విడాకుల వరకూ దారి తీస్తుంది..కాబట్టి వీటి గురించి ఆలోచించండి..