కొడంగలు రైతులకు బేడీలు వేసి..కొట్టారు.. వాళ్లకు పరీక్షలు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు కేటీఆర్. పట్నం నరేందర్, రైతుల అరెస్ట్ పై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారా అంటూ నిప్పులు చెరిగారు కేటీర్. పోలీసులు రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు.. రిమాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలని కోరారు కేటీఆర్. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాల వలనే లగచర్ల ఘటన జరిగిందని తెలిపారు. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి భరతం పడుతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అన్నారు. సీఎం సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అని తెలిపారు. సీఎం అలుడు సత్యనారాయణరెడ్డి, అన్నం శరత్ ల ఫార్మా కంపెనీలను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరిస్తుందని వివరించారు.