ఆ స్కూల్ లో చేరితే.. ఫోన్ ఫ్రీ..!

-

తమిళనాడు మదురైలోని తియాగరాజర్ పాఠశాల.. విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్​ పెట్టింది. తమ స్కూల్​లో చేరే 6వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపింది. ఆన్​లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీటిని అందించనున్నట్లు పేర్కొంది యాజమాన్యం.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభించిన యాజమాన్యాలు.. విద్యార్థులకు వర్చువల్​గానే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకూ అంగీకారం తెలిపింది.

ఫలితంగా కొత్త విద్యార్థుల కోసం మొబైల్ ఫోన్ల ఆఫర్​ పెట్టింది తియాగరాజర్​​ స్కూల్​. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు పాఠశాల కావడం విశేషం.ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో విద్యార్థులకు మొబైల్ ఫోన్లు అందించ​నున్నట్లు తెలిపారు తియాగరాజర్​​ స్కూల్​ ప్రధానోపాధ్యాయులు రామనాథన్​. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే తమిళ భాషను ప్రోత్సహించేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version