కోవిడ్‌ పేషెంట్లను కాపాడుతున్న మరొక మెడిసిన్‌.. ఎమర్జెన్సీని తప్పిస్తోంది..

-

ఎమర్జెన్సీ స్థితిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు ప్రస్తుతం రక రకాల మెడిసిన్లను అందజేస్తున్న విషయం విదితమే. ఫావిపిరవిర్‌కు తోడుగా, స్టెరాయిడ్‌ మెడిసిన్లు, ప్లాస్మా థెరపీ చేస్తున్నారు. అయితే కోవిడ్‌ పేషెంట్లను ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించేందుకు మరొక మెడిసిన్‌ కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

లో-మాలిక్యులార్‌-వెయిట్‌ హెపారిన్‌ (LMWH) అనే మెడిసిన్‌ వల్ల కోవిడ్‌ రోగులకు ప్రాణాపాయ స్థితి 90 శాతం వరకు తప్పుతుందని, దీంతో వారు త్వరగా కోలుకుంటున్నారని కూడా వైద్యులు తెలిపారు. ఈ మెడిసిన్‌ను ఇప్పటికే యాంటీ కోఆగులెంట్‌ డ్రగ్‌గా వాడుతున్నారు. ఇది రక్తాన్ని పలుచన చేస్తుంది. రక్త గడ్డలు కట్టే సమస్య ఉన్నవారికి, రక్తనాళాలు ఉబ్బిపోయే సమస్య ఉన్నవారికి ఇప్పటికే ఈ మెడిసిన్‌ను ఇస్తున్నారు. అయితే ఈ మెడిసిన్‌ కోవిడ్‌ ప్రాణాపాయ రోగులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చారు.

కోవిడ్‌ ప్రాణాపాయ స్థితి ఉన్న రోగుల్లో ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు వాపులకు లోనవుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువవుతుంది. అలాగే శరీరంలోని ఇతర రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడంతోపాటు ఆ నాళాలు వాపులకు గురవుతాయి. దీంతో రోగికి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. హార్ట్‌ ఎటాక్‌, కిడ్నీలు, లంగ్స్ ఫెయిల్‌ అవుతాయి. ఫలితంగా కోవిడ్‌ రోగి చనిపోతాడు. అయితే ఆ వాపులను తగ్గించడంతోపాటు రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేందుకు ఈ LMWH డ్రగ్‌ పనిచేస్తుంది. దీని వల్ల కోవిడ్‌ పేషెంట్లకు ప్రాణాపాయం తప్పుతుంది. కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకుంటారు కూడా. ఇక ఈ డ్రగ్‌ను ఇప్పటికే దేశంలోని పలు హాస్పిటళ్లలో ఉపయోగిస్తుండగా.. సత్ఫలితాలు కూడా వస్తున్నాయని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version