చెరువుల్లో.. నీట కుంటల్లో.. కొలనులో ఎక్కువగా కనిపించే ఈ కలవ పూలు చూడడానికి చాలా ఆకర్షణగా ఉండడమే కాకుండా మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇకపోతే చాలావరకు ఈ కలువ పూలను లక్ష్మీదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటిలో ఉండే ఔషధ గుణాలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసనే చెప్పాలి. పువ్వులు అనేవి పూజకు మాత్రమే పనికి వస్తాయి అంటే పొరపాటు. పువ్వులు పూజకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఇకపోతే కలువ పువ్వుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
కలువ పువ్వుల రేకులు హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చాలా సమర్థవంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా శరీరం అలసటకు గురైనప్పుడు, నీరసం, బద్దకంగా అనిపించడం లాంటి సమస్యలు ఎదురైతే రేకులను నీటిలో మరగబెట్టి ఒక కాటన్ వస్త్రంలో వేసి పిండాలి. ఇక వచ్చిన ద్రవంలో పంచదార వేసి మళ్లీ ఆ ద్రవం సగం అయ్యేవరకు మరగబెట్టాలి. ఇలా వచ్చిన ద్రవాన్ని సేవిస్తే మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే సమస్యను బట్టి మోతాదు తీసుకోవాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కలువ పువ్వుల ప్రయోజనాలు మీరు పొందాలి అంటే ఆయుర్వేద నిపుణుల సలహాల మేరకు వీటి ఔషధం తీసుకోవడం ఉత్తమమైన పని.
ఎర్ర కలువ గింజలు అజీర్తికి పనిచేస్తే..కలువ వేర్లు జిగట విరోచనాలను, రక్త విరోచనాలను నయం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా పువ్వుల విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి తీసుకోవచ్చు. ఇకపోతే ఎర్ర కలవలే కాకుండా మిగిలిన రంగులలో ఉండే కలువ పువ్వులలో కూడా అనేక రకాల ఔషధాలు ఉంటాయి. ఇక వీటి ప్రయోజనాలు మీరు పొందాలి అంటే ఆయుర్వేద నిపుణుల సలహాలు సూచనల మేరకు ఎలా ఉపయోగించాలి? ఎంత మోతాదులో ఉపయోగించాలి? అనే ప్రతి విషయం తెలిసిన తర్వాత వీటిని ఉపయోగించడం మంచిది.