కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయంత తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేశారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టి మళ్లీ కడుతున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచే మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టించినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. అయితే… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాస్తు దోషం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారు. మంత్రి పదవి రావడం కోసం… వాస్తు సెట్ చేసుకుని… మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించుకునేందుకు ఇలా చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాస్తు దోషం
మంత్రి పదవి రావడం లేదని మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టి మళ్లీ కడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి pic.twitter.com/mYREYGSbLE
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025