కరీనా కపూర్ ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కరీనాకపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కరీనాకపూర్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక తన కుటుంబం కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో ఎంట్రీ కూడా చాలా సులువుగానే జరిగింది. మొదట రెఫ్యూజీ అనే చిత్రం ద్వారా కరీనాకపూర్ తన కెరీర్ ని మొదలు పెట్టింది. తన సహనటుడు అయినా సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కరీనాకపూర్ కొన్ని కోట్ల రూపాయలను సంపాదించినట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

కరీనాకపూర్ ఆస్తి విలువ సుమారుగా రూ.50 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరీనాకపూర్ ప్రతి ఏడాదికి కూడా రూ.15 కోట్ల రూపాయల సంపాదిస్తున్నట్లుగా సమాచారం. ఇక ముంబైలో ఒక ఖరీదైన ఇంట్లో ఉంటున్నారు కరీనాకపూర్ తన భర్త. దాని ధర రూ.55 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక అంతే కాకుండా జిస్టాడ్ లో ఉన్న భవనం ఖరీదు దాదాపుగా రూ.35 కోట్ల రూపాయలు ఉంటున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా స్విస్ లో కూడా ఒక ఇల్లు కలిగి ఉన్నది.

ఇక కరీనా కపూర్ దగ్గర ఉన్న కార్ల విలువ దాదాపుగా 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉన్నట్లుగా సమాచారం. ఇక తన భర్త సైఫ్ అలీఖాన్ కూడా ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కరీనాకపూర్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తాజాగా కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..మొత్తానికి కరీనాకపూర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version